హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డమ్మీ ఐటి కంపెనీలతో మోసం: ముగ్గురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hitech City
హైదరాబాద్: డమ్మీ ఐటి కంపెనీలతో 18 బ్యాంకులను మోసం చేసిన ముగ్గురిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డమ్మీ ఐటి కంపెనీలతో వారు బ్యాంకులకు 1.07 కోట్ల రూపాయల మేరకు టోపీ పెట్టారు. షేక్‌పేటకు చెందిన మాచెర్ల వెంకట సురేష్, మణికొండకు చెందిన కాటే శ్రీనివాస రావు, అతని సోదరుడు, అమీర్‌పేటకు చెందిన కాటె నవీన్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస రావు ఎంబిఎ గ్రాడ్యుయేట్.

ఈ ముగ్గురు కూడా మొదట హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో అడ్రాయిట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కన్సల్టెన్సీ (ప్రై) లిమిటెడ్‌ పేర రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలను ప్రారంభించారు. ఆ తర్వాత నకిలీ గుర్తింపులతో అమీర్‌పేటలో ఎలైట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఇన్ఫో (ప్రై) లిమిటెడ్ కంపెనీలను ప్రారంభించారు. నకిలీ ఉద్యోగుల పేరుతో ఆ ముగ్గురు కూడా వేతన ఖాతాలను తెరిచారని, కొన్ని ఫొటో స్టూడియోల నుంచి ఫొటోలను జమచేసి వారి ఫొటోలు అతికించి, వారిని తమ ఉద్యోగులుగా చెప్పుకున్నారని హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఆ రకంగా వారు 50 ఖాతాలను 18 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.

ముగ్గురిని కూడా ఆదివారంనాడు వారి ఇళ్లలో అరెస్టు చేసినట్లు ఖాన్ చెప్పారు. వారి నుంచి రెండు కార్లు, మూడు బైకులు, 14 తులాల బంగారం, 150 చెక్ బుక్కులు, 120 ఫోర్జరీ చేసిన ఉద్యోగుల గుర్తింపు కార్డులు, 29 బ్యాంకు పాస్ బుక్కులు, 170 డెబిట్ - క్రెడిట్ కార్డులు, 75 పాన్ కార్డులు, ఎనిమిడి వోటర్ ఐడి కార్డులు, 21 మొబైల్ ఫోన్లు, 82 సిమ్ కార్డులు, ఎనిమిది కంప్యూటర్లు, సోనీ ఎల్ఇడి 42 ఇంచ్ టీవి, రూ. 3.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Task Force sleuths have nabbed a trio who had duped 18 banks to the tune of Rs 1.07 crore by floating dummy software firms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X