కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు, ఉద్రిక్తత

Kavitha
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు గురువారంట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. రాష్ట్రంలోని పలుచోట్ల రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె అక్కడి నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ వారు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కవితను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కవితను, మరికొందరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో విగ్రహం పెట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన రాసిన రాజ్యాంగంతోనే పదవులు పొందిన మీరు, ఆయన విగ్రహం పెట్టడానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. ఈ విషయమై గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశామన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రి శంకర రావు బర్తరఫ్ నిరసిస్తూ దళిత సంఘాలు ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+