హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ కేసులో నేడు చార్జిషీట్, ఆచార్య పేరు లేకుండా

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Prasad-Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ బుధవారం సాయంత్రంలోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనుంది. సాయంత్రం నాలుగు గంటలకు చార్జిషీట్ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేస్తుంది. కోనేరు ప్రసాద్, విజయ రాఘవన్, సునీల్ రెడ్డిలపై చార్జిషీట్‌లో అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. రిమాండ్ గడువు ముగియడంతో ఆ ముగ్గురిని అధికారులు బుధవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, చార్జిషీట్ దాఖలు చేసేవరకు వారిని కోర్టులోనే ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకు వారు కోర్టులోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ నలుగురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు బిపి ఆచార్య పేరును చార్జిషీట్‌లో చేర్చలేదని తెలుస్తోంది. ఐఎఎస్ అధికారి కావడంతో ఆయన పేరును చార్జిషీట్‌లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది.

సిబిఐ 200 మందికిపైగా సాక్షులను విచారించి దాదాపు 130 పేజీల చార్జిషీట్‌ను సిబిఐ రూపొందించినట్లు సమాచారం. విల్లాల యజమానుల నుంచి సునీల్ రెడ్డి 70 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిబిఐ అభియోగం మోపినట్లు సమాచారం. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి కోనేరు ప్రసాద్ 138 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు అభియోగం మోపినట్లు సమాచారం. ఎమ్మార్‌లో ప్రభుత్వ వాటా తగ్గింపులో విజయ రాఘవన్ ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య సిబిఐ కస్టడీ కూడా సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. తాము చార్జిషీట్ దాఖలు చేసే సమయంలోనే బిపి ఆచార్యను సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

English summary
CBI to file chargesheet in the court today, without adding IAS officer BP Acharya's name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X