హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఓకే, కాపుపైనే తర్జన భర్జన!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kapu Ramachandra Reddy-Shoba Nagi Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి కూడా సమాచారం అందించారు. వాస్తవానికి సోమవారమే హాజరు కావాల్సిందిగా శోభా నాగి రెడ్డికి సమాచారం పంపారు. అయితే పిఆర్పీ విప్ వంగా గీత వ్యక్తిగత కారణాల రీత్యా రెండు రోజుల గడువు కోరడంతో విచారణను గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు. కాగా, స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కారాదని ఇప్పటికే శోభా నాగి రెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారం ఆమె స్పీకర్ ఎదుట హాజరు కాబోరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, కాపు రామచంద్రారెడ్డి విషయంలో స్పీకర్ మనోహర్ ఎదుట ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ ప్రవేశ పెట్టే సాక్ష్యాధారాలే కీలకం కానున్నాయి. తాను కోరిన సమాచారాన్ని పంపనందున గురువారం జరిగే విచారణకు రావడం లేదని స్పీకర్‌కు కాపు స్పష్టం చేశారు.

దీంతో, ఈ విచారణకు వంగా గీత, కొండ్రులు మాత్రమే హాజరై, విప్ జారీచేసిన సాక్ష్యాలను ప్రవేశ పెట్టే అవకాశముంది. కాగా, విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఎందుకు ఓటు వేయాల్సి వచ్చిందో వివరిస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు శోభా నాగి రెడ్డి పంపారు. ఆమె శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వంగా గీత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అనర్హత వేటును ఎదుర్కొంటున్న శాసన సభ్యులు రాజీనామా చేస్తే వాటిని ఆమోదించడం పరిపాటి. విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన జగన్ వర్గ ఎమ్మెల్యేలు 17 మందిలో శోభా నాగి రెడ్డి రాజీనామా చేసినందున ఆమె విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌కు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురుకాబోవని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరో 13 మంది విప్ తీసుకున్నట్టు అంగీకరించినందున వారి విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాయి. విప్‌ను స్వీకరించని ప్రసాదరాజు, చెన్నకేశవరెడ్డి సైతం, తమకు విప్ సమాచారం ఉందని అంగీకరిస్తున్నారు.

అయితే, కాపు రామచంద్రారెడ్డి మాత్రం విప్ అందలేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపునకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపాల్సిన బాధ్యత కొండ్రు మురళీపై పడింది. అసెంబ్లీలో పిఆర్పీ ఇప్పటి వరకు విలీనం కానందున శోభా నాగి రెడ్డి విషయంలో తర్జన భర్జన ఉంటుందేమోనని భావించినప్పటికీ ఆమె రాజీనామా చేసినందున ఎలాంటి సమస్య ఉండదంటున్నారు. దీంతో ఇప్పుడు కాపుదే ప్రభుత్వానికి సమస్యగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి గురువారంతో విచారణలు పూర్తయ్యే అవకాశముంది. మరో వారం రోజుల్లో శోభా నాగి రెడ్డి, కాపు సహా జగన్ వర్గ ఎమ్మెల్యేలందరి అనర్హతపై తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.

English summary
Speaker Nadendla Manohar issued notices to YS Jaganmohan Reddy camp PRP mla Sobha Nagi Reddy on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X