బెంగళూరులో 'రాబిన్ శర్మ' లీడ్ విత్‌అవుట్ ఎ టైటిల్

Robin Sharma Live in Bangalore! Lead Without A Title
భారత దేశంలో తక్కువ ఖర్చుతో గ్రామీణ వ్యవస్థాపకులకు మద్దతిచ్చే మొట్టమొదటి ఆన్‌లైన్ సూక్ష రుణ వేదిక 'రంగ్ దే'. జనవరి 2008వ సంవత్సరంలో ప్రారంభించబడి 6.4 కోట్లు కంటే ఎక్కువ నిధులను గత నాలుగు సంవత్సరాలుగా 13 రాష్ట్రాల నుండి 12500 తక్కువ ఆదాయం కలిగిన వ్యవస్థాపకులను అందించింది. దేశం మొత్తం మీద 3500 వ్యక్తులు సామాజిక పెట్టుబడిదారులుగా పాల్గొని వ్యాపారస్థులకు సామాజిక పెట్టుబడి దోహదం చేసాయి.

గత నాలుగు సంవత్సరాలుగా తన సత్తాని చూపిస్తున్న.. తక్కువ ధర సూక్ష్మరుణ గురించి అవగాహన సృష్టించడానికి ప్రజలలో చైతన్యం కలిగించడానికి ప్రపంచ ప్రఖ్యాత నాయకత్వ గురు రాబిన్ శర్మ నాయకత్వంలో సగం రోజు కార్యక్రమం 'రంగ్ దే' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బెంగుళూరులోని యశ్వంత పూర్‌లో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ 'తాజ్ వివాంటా'లో 'లీడ్ విత్ అవుట్ ఎ టైటిల్' పేరు మీద ఫిబ్రవరి 29వ తారీఖున ఉదయం 9 గంటలు నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజన సదపాయం కూడా కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకత్వం వహిస్తున్న రాబిన్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. శర్మ తాను రచించిన పుస్తకం 'లీడ్ విత్ ఎ టైటిల్'లో మొత్తం కొత్త ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది. 'ఎవరైనా ఒక లీడర్ అవ్వవచ్చుననే ఒక నమ్మకం సృష్టించడం ' ముఖ్యంగా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. రాబిన్ శర్మ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పుస్తక రచయిత. తాను రచించిన 11 పుస్తకాలు అంతర్జాతీయంగా ఉత్తమ అమ్మకందారుల లిస్ట్‌లో చేరిన కొన్ని పుస్తకాల పేర్లు మీకోసం ప్రత్యేకంగా...

* ది మాంక్ హు సోల్డ్ ఇజ్ ఫెరారీ
* ద గ్రేట్‌నెస్ గైడ్
* ది లీడర్ హు హ్యాడ్ నో టైటిల్.

శర్మ లీడర్ షిప్ ఇంటర్నేషనల్ ఇంక్ (SLI) వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్దలు రాబిన్ శర్మ క్లయింట్స్‌గా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన జీవితంలో అనుభవాన్ని నేర్పడమే కాకుండా నాయకత్వ లక్షణాలను ప్రేరేపించేలా చేస్తుంది. ప్రొపెషనల్ మరియు పర్సనల్ జీవితంలో నిర్భయంగా అన్ని రకాల బాధ్యతలను తీసుకునేందుకు దోహాదపడుతుంది. భారతదేశంలో తక్కువ ఆదాయం కలిగి ఉన్న కుటుంబాలకు సంబంధించి ఈ ఈవెంట్ సానుకూల కథలను తెలియజేయడమే కాకుండా సూక్ష్మ రుణాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుస్తుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పాస్‌లు 'https://bitly.com/y3Atgq' ఈ లింక్‌లో లభిస్తున్నాయి.

మరింత సమాచారం కోసం సంప్రదించండి "లీడ్ విత్‌అవుట్ ఎ టైటిల్":

అదితి: 9591527628, [email protected]

స్మిత: 9686114608, [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+