కన్నడ అసెంబ్లీలో బ్లూఫిలిమ్స్ చూసిన బిజెపి మంత్రులు

పక్కనే ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పాటిల్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఓడరేవుల శాఖ మంత్రి జె.కృష్ణ పాలేమార్‌కు చెందిన ఆ ఫోన్లో నీలిచిత్రం చూస్తూ వీరిద్దరూ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల కళ్లలో పడటం గమనార్హం. ఈ ఘటనతో బిజెపి సర్కారు పరువు పూర్తిగా మంటగలిసింది. ఆ మంత్రులిద్దరినీ తక్షణం డిస్మిస్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై బిజెపి అధిష్ఠానం భగ్గుమంది. ముగ్గురు మంత్రులనూ రాజీనామా కోరాలని ముఖ్యమంత్రి సదానంద గౌడను పార్టీ అధ్యక్షుడు గడ్కరీ ఆదేశించారు. వారు అంగీకరించకపోతే బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ భరద్వాజ్ కేంద్రానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్, లోకాయుక్త తదితర సమస్యల్లో ఇరుక్కున్న బిజెపికి ఇది మరో దెబ్బ.
కాగా, మంత్రి లక్ష్మణ్ సవది తమ చర్యను సమర్థించుకున్నారు. అది నీలిచిత్రం లాంటిదేనని, కృష్ణ పాలేమార్ ఫోన్లో అది ఉందని, కొందరు మహిళలు డాన్సు చేయడం, తర్వాత వాళ్లను నలుగురు అత్యాచారం చేయడం లాంటి దృశ్యాలున్నాయని, విదేశాల్లో జరిగే రేవ్ పార్టీల్లో ఇలాంటివి ఉంటాయని పాలేమార్ నాకు చెప్పారని, ఉడుపి బీచ్‌లో పర్యాటక శాఖ కార్యక్రమంలో ఇలాంటిదే జరగడం సభ దానిపై చర్చిస్తుండటంతో నేను ఆ దృశ్యాలు చూశానని అన్నారు. సవది వ్యాఖ్యలను పాలెమార్ ఖండించారు. కాగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు బుధవారం ఉదయం తమ పదవులకు రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications