చీఫ్ విప్‌గా గండ్ర: విప్‌గా చిరు వర్గం ఎమ్మెల్యే అనిల్

చిరంజీవి వర్గం నుంచి విప్ పదవి కోసం వంగా గీత కూడా పోటీ పడ్డారు. అయితే తెలంగాణకు తన వర్గం నుంచి ఓ పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన చిరంజీవి అనిల్ వైపే మొగ్గు చూపారు. రాయలసీమకు చెందిన సి. రామచంద్రయ్యకు, కోస్తాంధ్రకు చెందిన గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవులు దక్కడంతో ప్రాంతీయ సమతుల్యత కోసం తన వర్గానికి చెందిన తెలంగాణ శానససభ్యుడు అనిల్‌కు విప్ పదవి ఇవ్వాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications