తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెచ్చిపోయి మాట్లాడకు: కెసిఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: తనపై విమర్శలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మండిపడ్డారు. రెచ్చిపోయి మాట్లాడవద్దని హెచ్చరించారు. కెసిఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. నాలుక చీరుస్తా అంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అలా అయితే ఇతరులు రెచ్చిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. తమ నాయకులూ అలా మాట్లాడగలరన్నారు. కాంగ్రెసు పార్టీ దోపిడీ దొంగల పార్టీ అని విమర్శించారు. లిక్కర్ సిండికేట్లకు సంబంధించిన ఎసిబి రిపోర్టును బహిర్గతం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదన్నారు. కొన్ని జిల్లాల్లోనే ఎసిబి దాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలన్నారు. మద్యం అక్రమాలకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో యువతరంగం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. బాబుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. కాగా పిచ్చి కూతలు కూస్తే నాలుకలు కోస్తామని కెసిఆర్ గురువారం బాబును, తెలుగదేశం తెలంగాణ ఫోరం నేతలను హెచ్చరించారు. పోలవరం టెండర్లపై న్యాయవిచారణే కాదు, అంతకన్నా ఉన్నతమైన విచారణకైనా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు. న్యాయవిచారణలో తమది తప్పు లేదని తేలితే హైదరాబాదులోని ఆబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా అని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణలో చంద్రబాబుకు బతుకే లేకుండా పోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, చంద్రబాబుది లఫంగా బతుకు అని, నీచమైన హేయమైన చరిత్ర చంద్రబాబుది అని ఆయన అన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu warned TRS chief K Chandrasekhar Rao for his comments agains him and Telangana TDP forum leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X