వైయస్ విజయమ్మను తప్పు పట్టిన ఎర్రన్నాయుడు

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేష్ కుమార్‌ను ఎవరో డబ్బులివ్వడం వల్ల చదివించారనే మాటలు ఇకనైనా ఆపాలన్నారు. కావాలంటే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి వివరాలు తెప్పించుకోవచ్చునని, వారేమీ డబ్బుల కోసం సీట్లు అమ్ముకోరన్నారు. సాక్షి పత్రిక, ఛానల్ అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. సాక్షి కథనాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడకు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. వాటి తీరు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి అన్నారు. జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వార్తలపై న్యాయవ్యవస్థల్లో పోరాడుతామన్నారు.
వామపక్షాలతో తాము కలిసి పని చేస్తున్నామని అవి తమ పార్టీకి మిత్రపక్షాలని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించాలని సిపిఎంను కోరుతున్నామని, అయినా పోటీ చేయాలనుకుంటే అది వారిష్టమని చెప్పారు. ఒకవేళ వారు పోటీ చేసినా ఇరు పార్టీల మధ్య సంబంధాలపై ఉప ఎన్నికల అంశం ప్రభావం చూపదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications