మద్యం సిండికేట్లు, ఇది రూ. 15 వేల కోట్ల స్కామ్

మద్యం సిండికేట్ల వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు పెద్ద యెత్తున గండి కొట్టారని చెప్పింది. మద్యం సిండికేట్లకు సంబంధించి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. అరెస్టయినవారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రైవేట్ వ్యక్తులు ఎసిబి చట్టం పరిధిలోకి రారని, అటువంటప్పుడు వారిని ఎసిబి ఎలా అరెస్టు చేస్తుందని, అటువంటి వారికి బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరఫు న్యాయవాది వాదించారు.
కాగా, ఖమ్మం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయిన నున్న రమణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై రేపు గురువారం విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications