అమ్మ చూస్తుందని వైయస్ జగన్ చెప్పారు: ధర్మాన

కాగా తాను తన అరెస్టు గురించి ఆలోచించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన వర్గం శాసనసభ్యులతో అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో లోటస్ పాండులో భేటీ అయిన సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి మరికొద్ది రోజుల్లో జగన్ అరెస్టు అవుతారని ప్రచారం చేస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని, అందుకు స్పందించిన జగన్.. తాను అరెస్టు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, వారు ఏమైనా అనుకోనివ్వమని, నేను మాత్రం నా అజెండాతో ముందుకెళతానని, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే నా తల్లి విజయలక్ష్మి పార్టీ వ్యవహారాలు చూసుకుంటుందని వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications