ఆ మంత్రిని శాడిస్టులా చూస్తున్నారు: జగన్ వర్గం నేత

Balineni Srinivas Reddy
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో మంత్రి మహీధర్ రెడ్డిని జనమంతా శాడిస్టులా చూస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి శుక్రవారం అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ప్రభుత్వానికి ఖచ్చితంగా రెఫరెండమేనని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరులో అలవోకగా గెలుస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలను స్పీకర్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెసు పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించడం లేదని విమర్శించారు.

కాగా వచ్చే మార్చి 18వ తేదిన తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలతో పాటు కోస్తాంధ్రలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జగన్ పార్టీ కేవలం కొవ్వూరు నియోజకవర్గంలోనే పోటీ చేస్తుంది. తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+