కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము పిలుపునిచ్చిన బంద్‌లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పొరపాటుగా అంగీకరించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందులకు పిలుపునివ్వడం పొరపాటు అని ఆమె స్పష్టం చేశారు. కాగా మంగళవారం కార్మిక సంఘాలు మంగళవారం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సార్వత్రిక సమ్మెపై ఆమె స్పందించారు. అధికారంలోకి వచ్చాక ఆమె రాజకీయ బంద్ లపై యు టర్న్ తీసుకున్నారు. మంగళవారం రాష్ట్రంలో బంద్ కు ఆమె నిరాకరించారు. బంద్ లో పాల్గొనబోయే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ బ్రేక్ రూల్ వర్తింప చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి మంగళవారం డ్యూటీకి వచ్చినట్టు రిపోర్టు లేకపోయినా, ఎవరైనా పబ్లిక్ వెహికిల్స్ నడపకపోయినా వారికి సర్వీస్ బ్రేక్ రూల్ వర్తింప చేస్తామని ఆమె హెచ్చరిక జారీ చేశారు.
మమత ఓ టీవి ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ... సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి బంద్‌లకు తాను అనుమతించేది లేదని చెప్పారు. మంగళవారం బస్సులు, ట్రామ్‌లు రోడ్డెక్కుతాయని చెప్పారు. దుకాణాలు, మార్కెట్లు తెరవబడతాయన్నారు. ఎక్కడ ఎవరు బంద్ పేరిట సామాన్యులను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా పోలీసులు నచ్చజెపుతారన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Resorting to bandhs during her opposition days was a mistake, West Bengal chief minister Mamata Banerjee admitted on Monday, a day before the showdown between her government and the CPI(M) plays out on the streets of the state centering the February 28 industrial strike.
Story first published: Tuesday, February 28, 2012, 9:37 [IST]