వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్సపై టిడిపి ఫైర్: అధికార పక్ష సభ్యుల మౌనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మద్యం, ఇసుక సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రవాణా శాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై బుధవారం శాసనసభలో ఎదురుదాడికి దిగారు. బొత్స సత్యనారాయణపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం సభ్యులు విమర్శల వర్షం కురిపిస్తుంటే కాంగ్రెసు సభ్యులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.

తన బంధువులకు మద్యం దుకాణాలున్నాయని, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మద్యం వ్యాపారాలున్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. మద్యం సిండికేట్లపై విచారణ పూర్తయిన తర్వాత స్పందిస్తానని తాను ఇది వరకే చెప్పానని, తాను స్పందిస్తే విచారణపై ప్రభావం పడుతుందనే మాట్లాడలేదని ఆయన చెప్పారు. బొత్స సత్యనారాయణపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రెండు రోజులు సభలో మద్యం సిండికేట్లపై చర్చ జరిగితే బొత్స లాబీల్లో దాక్కున్నారని ఆనయ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని మద్యం, ఇసుక సిండికేట్లలో బొత్స పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబుకు ఏ కోర్టయినా క్లీన్ చిట్ ఇచ్చిందా అని బొత్స సత్యనారాయణ అడిగారు. అలా క్లీన్ చిట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లతో సంబంధాలున్న బొత్స రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో క్లీన్ చిట్ ఇవ్వకపోయినా క్లీన్ చిట్ ఇచ్చినట్లు బొత్స గొప్పలు చెప్పుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

English summary
Opposition leader N chandrababu Naidu lashed out at PCC president Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X