కలుద్దాం రండి: కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి సీటు ఆఫర్

సాధారణ సంఖ్యాబలం ఉంటేనే కాంగ్రెస్ నాలుగు రాజ్యసభ సీట్లు గెలుచుకోగలుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీకి నాలుగో సీటుకు సరిపోను ఎమ్మెల్యేలు లేరని, కాబట్టి టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి ఒక అభ్యర్థిని నిలబెడితే ఈ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ నుంచి ఒక సీటును లాక్కోవచ్చునని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని వెతికిపట్టుకోవడం పెద్ద కష్టం కాదని, కావాలంటే కెసీఆర్ సామాజిక వర్గానికి చెందిన టిడిపి నేతను పెడతామని చెప్పారు. కాగా టిఆర్ఎస్ ఇప్పటికే చచ్చిన పార్టీ అని దానిని చంపాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications