చిరు రాజ్యసభకు వెళ్తే తిరుపతి నుంచి పోటీ: గల్లా జయదేవ్

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జయదేవ్ తెలిపారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లకుండా తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగితే తాను 2014లో శాసనసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మంత్రి గల్లా అరుణ కుమారి ఇది వరకే ధ్రువీకరించారు.
కాగా, చిరంజీవి రాజీనామా చేస్తే తిరుపతి నుంచి ఆయన సతీమణి సురేఖ గానీ సోదరుడు నాగబాబు గానీ పోటీ చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి అభిమతం మేరకు ఆయన కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని అంటున్నారు. గల్లా జయదేవ్ ప్రకటన కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications