వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగర్‌కర్నూల్ వచ్చే దమ్ముందా: బాబుకు నాగం సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

nagam janardhan reddy
మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు నాగర్ కర్నూల్ వచ్చే దమ్ముందా అని తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ ఆదివారం విసిరారు. ఆయన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. టిడిపిలో చంద్రబాబు తర్వాత రెండో స్థానానికి తాను ఎదిగానని ఆయన చెప్పారు. 2004లో చంద్రబాబు సమైక్యవాదంతో పోటీ చేసి కేవలం తొమ్మిది సీట్లే గెలుచుకున్నారని, 2009లో మాత్రం తెలంగాణవాదంతో పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నారని, మేనిఫెస్టోలో కూడా తెలంగాణ చేర్చారని అయితే ఆ తర్వాత మాట మార్చారని అందువల్లనే తాను టిడిపిని వీడానని అన్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు ఎందరో తెలంగాణ విద్యార్థులు బలయ్యారన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం చేసినప్పటికీ చంద్రబాబు కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కానీ సంతాపం ప్రకటించారా అని ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాగానే కాంగ్రెసు, టిడిపి, పిఆర్పీ సీమాంధ్ర నేతలు ఒక్కటై వచ్చిన రాష్ట్రాన్ని అడ్డుకున్నారన్నారు.

చంద్రబాబుకు తన నియోజకవర్గం నాగర్ కర్నూల్ కు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. కెసిఆర్, తాను వేరు పార్టీలు అయినప్పటికీ తెలంగాణవాదం తమను ఒక్కటి చేసిందన్నారు. ఫోరం నేతలంతా బాబు దగ్గర నెలమామూళ్లు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించి టిడిపి, కాంగ్రెసు డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు. పేరుకే రూపాయి కిలో బియ్యం కానీ ఉప్పు, పప్పు రేట్లు మాత్రం మండిపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్లో తెలంగాణవాదం లేరని అంటున్నారని కానీ కొల్లాపూర్ వస్తే ఆయనకు తెలుస్తుందన్నారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడూ రాదన్నారు. తెలంగాణపై తీర్మానం పెట్టాలని అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన చంద్రబాబు సోనియా తెలంగాణ ప్రకటించాక డ్రామాలు ఆడటం ప్రారంభించారన్నారు. సీమాంధ్ర నేతలు అందుకు వంత పాడారన్నారు. తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాల్సి ఉందన్నారు.

ఎన్నికల కోసం తాను రాజీనామా చేయలేదని తెలంగాణ కోసమే రాజీనామా చేశానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందన్నరు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఇచ్చి మాట మేరకు తాను తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తానని అన్నారు. మహబూబ్ నగర్‌కు తాను అడిగినన్ని నీళ్లు ఇస్తే తాను ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటానని చెప్పినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తానంటున్న నేతలు రెండేళ్లయినా రాజీనామాలు చేయడం లేదన్నారు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సిపిఐ నేతలు తదితరులు పాల్గొన్నారు.

English summary
TNS president Nagam Janardhan Reddy fired at TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X