హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో సాక్షిగా సిబిఐ ముందుకు మోపిదేవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkata Ramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ మంగళవారం సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఆయన మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిబిఐ ఎదుట హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన జగన్ ఆస్తుల కేసులో సాక్షిగా హాజరు అవుతున్నారు. తాను మధ్యాహ్నం సిబిఐ ఎదుట హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని మోపిదేవి చెప్పారు. వివాదాస్పద జివోలలో తన తప్పు లేదన్నారు. మరోవైపు ఐఏఎస్ అధికారి మన్మోహన్‌కు కూడా సిబిఐ ఇదే కేసులో నోటీసులు జారీ చేసింది. ఆయన సిబిఐ ఎదుట దిల్ కుషా అతిథి గృహంలో హాజరు కానున్నారు.

కాగా జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే విజయ సాయి రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. ఈ కేసులో పలు కంపెనీలు, పలువురు వ్యక్తిగతంగా సిబిఐ ఎదుట హాజరవుతున్నారు. వచ్చే నెలలో జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది.

English summary
CBI issued notices to minister Mopidevi Venkata Ramana in YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X