రాపోలు ఆనంద భాస్కర్ ఎంపిక: కేశవరావుకు చెక్

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే సులువుగా విజయం సాధించే వాడినని తన సన్నిహితుల వద్ద కేశవ రావు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో తనను అభిమానించే ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి కూడా ఓట్లు వేయిస్తామని ఆ పార్టీ పెద్దలు కొందరు తనకు హామీ ఇచ్చారని కేశవరావు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇలా మొత్తం 46 ఓట్లు తనకు పడేవని, తద్వారా తాను గెలుపొందే వాడినన్నది ఆయన అభిప్రాయమని చెబుతున్నారు. సోనియాకు తన పట్ల మంచి అభి ప్రాయమే ఉన్నదని, అయితే ముఖ్యమంత్రే తనకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుపడ్డారని కేకే అన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications