కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు
Districts
oi-Pratapreddy
By Pratap
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన సమీప అభ్యర్దులపై 14, 019 ఓట్లతో గెలుపొందారు. ఆయన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల కన్నా ముందంజలో దూసుకుపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూడా జూపల్లి ఆధిక్యత చూపారు.
జూపల్లి కృష్ణా రావు కాంగ్రెసు పార్టీకి, మంత్రిపదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. జూపల్లికి పోస్టల్ బ్యాలెట్‌లో 36 ఓట్ల ఆధిక్యత లభించింది.