వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ప్రకటనలో శ్రీకృష్ణుడిగా గుజరాత్ సిఎం మోడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sri Krishna
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని శ్రీకృష్ణుడిగా చూపిస్తూ స్థానిక వార్తా పత్రికలలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర బిజెపి ఈ ప్రకటన ఇచ్చింది. ఇందులో నరేంద్ర మోడిని శ్రీకృష్ణుడిగా చూపించారు. ఓ గుజరాతీ పత్రికలో వచ్చిన ఈ ప్రకటన అమ్రేలీ జిల్లా అధ్యక్షుడు భరత్ కనబార్ రూపొందించారు.

ఇది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమై కూర్చుంది. ఇందులో మోడిని శ్రీకృష్ణుడిగా చూపిస్తూ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆర్‌సి ఫాల్దును అర్జునుడిగా చూపించారు. పార్టీ నేతలు విజయ రూపాని, పురుషోత్తమ్, రూపాలా, ఎల్‌కె జడెజాను ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులుగా చూపించారు.

కిషన్ యాత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ ప్రకటన బిజెపి నేత ఇచ్చారు. సౌరాష్ట్ర ఎడిషన్‌లో వచ్చింది. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెసు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ఈ కిషన్ యాత్రను ఫాల్దు చేపట్టారు. ఇది శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడి సాయంత్రం ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు.

ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.. సైంటిఫిక్ అడాప్షన్ ద్వారా నాణ్యత, పంట ఉత్పత్తి బాగా ఉంటుందని సౌరాష్ట్ర రైతులలో చైతన్యం తీసుకు రావడం కోసం. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఫాల్దు గురువారం మీడియాతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆయన మండిపడ్డారు.

English summary
Gujarat Chief Minister Narendra Modi has been depicted as Lord Krishna in a BJP advertisement published in a local newspaper Friday. The advertisement, which is sure to kick up a controversy, has been given by BJP's Amreli district unit President Bharat Kamdar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X