నందమూరి, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ, అరెస్ట్

విజయవాడలోని గొల్లపూడిలోని ఓ ప్రయివేటు కళాశాల ప్రాంగణంలో ఇది జరిగింది. కటౌట్‌ల విషయమై ఇరువురు అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇరువురు హీరోల అభిమానులను సముదాయించిన పోలీసులు ఉద్రిక్తతకు కారణమైన ఇరవై మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఎన్టీఆర్ దమ్ము సినిమా ఆడియో ఇటీవలే విడుదలయింది. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఆడియో ఆదివారం సాయంత్రం విడుదలవుతోంది.
మరోవైపు విశాఖపట్నం జిల్లాలో పవన్ కల్యాణ్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఆయనతో కరచాలనం కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications