నటి అపహరణ, హత్య: ఇద్దరు ఆర్టిస్టుల అరెస్టు

భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం కల్పిస్తామని వారిద్దరు మీనాక్షి థాపను నమ్మించి అపహరించారని పోలీసులు చెబుతున్నారు. ఆమె సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిందనే భావనతో ఆమె కుటుంబం నుంచి వారిద్దరు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత కూడా వారు డబ్బుల కోసం ఆమె కుటుంబానికి ఫోన్ చేశారు.
జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరిని పోలీసులు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అరెస్టు చేశారు. మీనాక్షి థాపా మృతదేహాన్ని గాలించి, పట్టుకుని, గుర్తించడానికి ఓ పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. తాను సంపన్న కుటుంబం నుంచి వచ్చినట్లు థాపా వారికి చెప్పినట్లు తెలుస్తోంది. దాన్ని విశ్వసించి వారు ఆమెను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
మీనాక్షి థాపా మధుర్ భండార్కర్ హీరోయిన్ సినిమాలో చిన్నపాటి పాత్ర వేస్తోంది. ఆమె గత నెల రోజులుగా కనిపించలేదు. హీరోయిన్ సినిమా షూటింగులోనే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మీనాక్షి థాపాతో చనువు పెంచుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications