సెక్స్ స్కాంలో ఒబామా గార్డులు, అధ్యక్షుడి సీరియస్!

ఒబామా ఈ వారాంతంలో కొలంబియాలో పర్యటించాల్సి ఉండగా ఆ ఏర్పాట్లు చూసేందుకు ముందుగానే వచ్చిన గార్డుల్లో 12 మంది ఇందులో ఉన్నారు. వాళ్లు తన వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని ఓ మహిళ కార్టాజెనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికా బృందానికి చెందిన సభ్యులతో పాటు మీడియా కూడా ఉంటున్న కార్బీ హోటల్లోని తమ గదికి ఈ గార్డులు వ్యభిచారిణులను తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే, కేవలం ఒక్క ఏజెంటే తన గదికి వ్యభిచారిణిని తెచ్చుకున్నట్లు మరో కథనం ఉంది.
అయినా ఆ బృందంలోని మొత్తం గార్డులందరినీ వెనక్కి పిలిచి విచారించాలని సీక్రెట్ సర్వీసెస్ అధిపతులు నిర్ణయించారు. కొలంబియాలో వ్యభిచారం చట్టబద్ధమే అయినా, ఆ వ్యాపారమంతా డ్రగ్స్ వ్యాపారులు, నేరస్తులతో కలగలిసి ఉంది. దీంతో పన్నెండు మంది గార్డులను ఇళ్లకు పంపేశారు. ఇప్పటికే కొత్త ఏజెంట్లను కొలంబియాకు పంపినందున ఒబామాకు వచ్చిన ముప్పేమీ లేదని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. కానీ, శుక్రవారం సాయంత్రం రెండు చోట్ల నాటుబాంబులు పేలడం, రాజధాని బొగోటాలో మరో రెండు పేలుళ్లు సంభవించడంతో.. భద్రత అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.
దాదాపు 34 దేశాల ప్రతినిధులు, దేశాధిపతులు ఇక్కడి సదస్సుకు హాజరవుతున్నారు. అందరూ వస్తున్నారని ఎక్కడెక్కడో ఉన్న వ్యభిచారిణులంతా కార్టాజెనాకు వచ్చారు. గార్డులు వారం క్రితమే వచ్చారని, అప్పటి నుంచి వాళ్లు బాగా తాగుతూనే ఉన్నారని హోటల్ ఉద్యోగి ఒకరు తెలిపారు. వీరి ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీక్రెస్ సర్వీసుల అధికార ప్రతినిధి ఎడ్విన్ డోనోవాన్ తెలిపారు. కాగా విచారణలో ఈ స్కాం నిజమే అని తేలితే దీనిని తాను తీవ్రంగా తీసుకుంటానని ఒబామా చెప్పారు.












Click it and Unblock the Notifications