పాకిస్తాన్ రాజకీయాల్లోకి వీణా మాలిక్?

తమ పార్టీ బహిరంగ సభల్లో వీణా మాలిక్ పాల్గొనే ఆవకాశాలున్నాయని పిటిఐ వర్గాలు చెప్పాయి. ఇందుకు సంబంధించి డైలీ టైమ్స్‌లో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి వీణా మాలిక్ ఎంట్రీ ఉపయోగపడుతుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. వీణా మాలిక్ తమ బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇస్తే యువత తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తుందని అంటున్నారు.
వీణా మాలిక తమ పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలియదని పిటిఐలో విదేశీ వ్యవహారాలను చూసే నాయకురాలు డాక్టర్ షిరీన్ మజారి అంటున్నారు. ఆ విషయం మీకు తెలిస్తే తనకు చెప్పాలని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎప్పుడూ వివాదాల్లో ఉండడం వీణా మాలిక్‌కు ఇష్టం కావచ్చు, లేదంటే అదో పబ్లిక్ స్టంట్ కూడా కావచ్చు. వివిధ కారణాల వల్ల ఆమె వ్యవహారాలు వివాదంగా మారాయి. రాజకీయ రంగం ప్రవేశంపై వార్తలు కూడా అటువంటి వివాదమే కావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications