హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ బెదిరింపు: సారయ్యను కాదన్న దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramreddy Damodar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణపై సభలు పెట్టడంపై ఆగ్రహించారని మంత్రి బస్వరాజు సారయ్య చేసిన ప్రకటనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి విభేదించారు. సారయ్య ప్రకటన ఆయన వ్యక్తిగతమని దామోదర్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సారయ్యతో వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పారో తెలియదని, అయితే రాజశేఖర రెడ్డి తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 1998లో తాను తెలంగాణకు అనుకూలంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కోరుతూ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతి పత్రం ఇవ్వడాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి సిఎల్పీ నేతగా ప్రోత్సహించారని ఆయన చెప్పారు.

తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడలేదని, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నారని ఆయన అన్నారు. సారయ్యతో వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పారో తెలియదని ఆయన అన్నారు. తెలంగాణకు డెడ్‌లైన్లు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్ హయాంలోనే తాము తెలంగాణపై తమ వైఖని వెల్లడించామని ఆయన చెప్పారు. తాను తెలంగాణపై సమావేశం ఏర్పాటు చేస్తానంటే తనను వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని సారయ్య చెప్పారు.

కేంద్ర మంత్రి వాయలార్ రవితో మాట్లాడిన తర్వాత తెలంగాణపై తమకు కాస్తా నమ్మకం కలిగిందని దామోదర్ రెడ్డి అన్నారు. అయితే, ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అన్నారు. తాము ఎవరనీ అవమానించడం లేదని, తెలంగాణ కోసం మాత్రమే మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాత పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయాన్ని పాటిస్తోందని, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అందర్నీ సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region sebiort MLA R Damodar Reddy differed with Bascaraju Saraiah, minister from Telangana, comments on YS Rajasekhar Reddy. He said that YS rajasekhar Reddy never opposed Telangana, in contrary supported Telangana activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X