కాంగ్రెస్‌కు ఝలక్: రేపు ఎమ్మెల్యే సుజయ్ రాజీనామా

Ranga Rao
విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం శాసన సభ్యుడు సుజయ కృష్ణ రంగారావు కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఈ నెల 30వ తేదిన కాంగ్రెసు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల సుజయ కృష్ణ రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యే సమయంలో కలిశారు.

ఆయన ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలో చేరే అవకాశముందని అప్పుడు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఆ తర్వాత కూడా ఆయన జగన్‌ను కలిశారు. దీంతో ఆయన మానసికంగా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే సుజయ సోదరుడు, బొబ్బిలి పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు బేబినాయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.

తన సోదరుడు సుజయ కాంగ్రెసు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈ నెల 30న రాజీనామా చేస్తారని చెప్పారు. తాను కూడా ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. అందుకే తొలుత సంఘీభావం తెలిపామన్నారు. వైకాపాలో ఎప్పుడు చేరేది కొద్దిరోజుల్లో వెల్లడిస్తామన్నారు.

కాగా వైయస్ ‌జగన్‌ను కలిసిన సుజయపై చర్యలకు కాంగ్రెసు పార్టీ సిద్ధపడింది. ఈ నేపథ్యంలో అంతకుముందే తాను రాజీనామా చేయడం ఉత్తమమని సుజయ భావిస్తున్నారని అంటున్నారు. కాగా సుజయ రాజీనామా విషయం తమకు తెలియదని పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ అన్నారు. మరోవైపు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాను జగన్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆముదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+