నటి రుచాకి భర్త వేధింపు, పిఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

తాను మూడు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తన భర్త, అత్తమామల పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యకరమని నటి రుచా అన్నారు. రుచా తన సోదరితో కలిసి విలే పార్లేలోని తన భర్త ఇంట్లో నివసిస్తున్నారు. తన అత్తామామలు తమ భవంతిలోని రెండో అంతస్తులో ఉంటారని ఆమె చెప్పారు.
తాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత తన భర్త అదృశ్యమై పోయాడని చెప్పారు. తాను మొదట భయపడ్డానని, అయితే ఆ తర్వాత తన హక్కుల కోసం పోరాడటమే మంచిదని భావించానని, అందుకే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని రుచా చెప్పారు. కాగా టివి నటి అయిన రుచా గుజ్రాతికి గృహ హింస ఉన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
రుచా 2010లో మితుల్ సంఘ్విని పెళ్లి చేసుకుంది. ఇతను కెమికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత భర్త నుండి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. కాగా రుచా పలు టివి సీరియళ్లలో నటించింది. టివి సీరియళ్లు చూసే వారికి ఈమె చిరపరిచితురాలు.












Click it and Unblock the Notifications