పారిపోతే అరెస్ట్ చేయొచ్చు: జగన్ పిటిషన్‌పై జెఠ్మలానీ

జగన్‌ను విచారణ కోసమంటూ పిలిచి సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసిందని జెఠ్మలానీ అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన సాక్ష్యులను ప్రలోభ పెడతారనే ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతోందని, జగన్ తన అరెస్టుకు ముందు సాక్ష్యులను ఎవరినీ ప్రభావితం చేసినట్లుగా ఆధారాలు లేవన్నారు. సమగ్ర విచారణ జరపకుండానే అరెస్టు చేశారన్నారు. జగన్ అరెస్టుకు సిబిఐ చూపించిన కారణాలు సరిగా లేవన్నారు.
సాక్ష్యాల మార్పునకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నిజాలు తెలుసుకోకుండా అరెస్టు చేశారని చెప్పారు. కోర్టు సమన్లు ఉన్నప్పటికీ అరెస్టు చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. ఈ అరెస్టు న్యాయవ్యవస్థను పోలీసు వ్యవస్థ సవాల్ చేస్తున్నట్లుగా ఉందన్నారు. సిబిఐ తన ఎఫ్ఐఆర్‌లో జగన్ పైన చాలా అభియోగాలు మోపిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టుకు మూడు ఛార్జీషీట్లు కూడా సమర్పించిందని చెప్పారు.
ఉప ఎన్నికలలో ప్రచారం చేసే జగన్ హక్కును కాలరాస్తూ అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 కింద జగన్‌ను అరెస్టు చేయడం తగదన్నారు. విచారణకు సహకరించనప్పుడు, సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారనుకున్నప్పుడు, విచారణకు అందుబాటులో లేకుండా పారిపోయినప్పుడు మాత్రమే అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. జగన్ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించారని చెప్పారు.
కాగా జగన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన అనంతరం సిబిఐ తరఫు న్యాయవాది తమ వాదనలు ప్రారంభమయ్యాయి. సమయం ముగియడంతో కోర్టు వాదనలను గురువారానికి వాయిదా వేసింది. రేపు సిబిఐ వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు చెప్పనుంది.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications