నన్ను తీసేస్తారంటే నవ్వొస్తుంది, ఢోకా లేదు: సిఎం

తన పదవికి ఢోకా ఏమీ లేదని చెప్పారు. "మీరు నన్ను తీసేయలేరు.. మీ కోరికేమీ నెరవేరదు'' అని ఆయన నవ్వుతూ చెప్పారు. అయినా పొద్దున్నే వార్తలు చదువుతుంటే నవ్వుకోవడం ఆరోగ్యానికి మంచిదే కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
మీ నాయకులే అలాంటి వార్తలు చెబుతున్నార ని ఓ మీడియా ప్రతినిధి అన్నప్పుడు "వారేం చెబుతున్నారో, మీరేం రాస్తున్నారో'' అంటూ మళ్లీ నవ్వేశారు. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో పార్లమెంట్‌లోని ఆయన గదిలోనే దాదాపు 45 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
తెలంగాణ సమస్యపై కూడా ఇప్పట్లో ఏ నిర్ణయం ఉండబోదని చెప్పారు. ఆ విషయం ఏమీ చర్చించలేదని చెప్పారు. ఢిల్లీలో పరిణామాల గురించి ఆజాద్‌ను అడిగినప్పుడు "మీరెలాగూ ఎక్కడి నుంచో తొంగి చూసినట్లు వార్తలు రాస్తున్నారు కదా.. ప్రత్యేకంగా నేనెందుకు చెప్పడం'' అని చమత్కరించారు.












Click it and Unblock the Notifications