కెసిఆర్, హరీష్‌లపై లగడపాటి నిప్పులు, జగన్‌పై సెటైర్

దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎంబిబిఎస్ సీట్లపై హరీష్ రావుది అర్థం లేదని వాదన అన్నారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు ఉన్నట్లు తాను గణాంకాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తప్పని తేలితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తప్పుడు లెక్కలు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని తెరాసకు హితవు పలికారు. కెసిఆర్ ఓ పైశాచికుడు అని, దుర్మార్గమైన వేర్పాటు వాది అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వాతిముత్యంలో కమల్ హాసన్‌లా తెలంగాణపై నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వేర్పాటువాదంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేర్పాటువాదాన్ని అణిచివేయడంలో సఫలమయ్యారన్నారు.
కిరణ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎప్పటికీ విడిపోదని, సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. కాగా మెడికల్ సీట్ల వ్యవహారంపై లగడపాటి తెరాస అధినేత కెసిఆర్‌కు ఓ లేఖ రాశారు. సీమాంధ్రలో కంటే తెలంగాణలోనే మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయని, గణాంకాలతో సహా నిరూపిస్తానని, తప్పని తేలితే రాజీనామా చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications