హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్‌పై దాడి, సీజ్: అమ్మాయిల అరెస్ట్, విఐపిల పిల్లలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pubs raided at Banjara Hills, 74 held
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మరో పబ్ పైన పోలీసులు దాడి చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న టానిక్ పబ్ పైన పోలీసులు ఆదివారం ఉదయం ఐదు గంటలకు దాడి చేశారు. సుమారు 74 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. టానిక్ పబ్‌ను సీజ్ చేసి, ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

నిబంధనల మేరకు రాత్రి పన్నెండు గంటల వరకే పబ్ నడవాల్సి ఉంటుంది. అయితే టానిక్ పబ్ మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఉదయం ఐదు గంటల వరకు నడుస్తూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. పట్టుబడ్డ వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వారు యువకులు. వీరిలో ప్రముఖుల తనయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలువురి నుండి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా పబ్ నడుస్తున్న సమాచారం అందుకున్న తాము ఉదయం దాడులు నిర్వహించామని డిసిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. టానిక్ పబ్ పైన ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పబ్‌ను సీజ్ చేశామన్నారు. పట్టుబడ్డ వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇస్తామని రవీంద్ర చెప్పారు.

కాగా ఇటీవల పలు పబ్‌ల పైన పోలీసులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు హయత్‌నగర్ సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పేరిట అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేశారు. అంతకుముందు బంజారాహిల్సులోని ఓ పబ్ పైన దాడి చేశారు.

English summary

 Banjara Hills police raid on Tonic Pub on Sunday morning which is located at Road Number 12 of Banjara Hills. 74 young arrested including 14 girls in this raiding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X