నవ్విన యడ్డీ!: సదానంద రాజీనామా, సిఎంగా శెట్టార్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా సదానంద గౌడ పైన ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. సదానంద తమకు రాజీనామా లేఖను ఇచ్చారని చెప్పారు. నాయకత్వ మార్పు కోసం పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ కర్నాటకకు వెళతారని చెప్పారు. పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కాగా సదానందను సిఎం పీఠం నుండి దింపి తన వర్గం నేత శెట్టార్‌కు బాధ్యతలు అప్పగించాలన్న యడ్డీ తన పంతం నెగ్గించుకున్నారు.
కాగా ఈశ్వరప్ప లేదా అశోక్‌లలో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారు. సదానంద గౌడ 2011 ఆగస్టులో అధిష్టానం నిర్ణయం మేరకు యడ్డీ నుండి సిఎం బాధ్యతలు స్వీకరించారు. యడ్యూరప్ప పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తొలుత సదానందను యడ్డీనే సూచించారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా అతనిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
తనకు డెబ్బైకి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్డీ అధిష్టానాన్ని హెచ్చరించారు. యడ్డీ సూచనల మేరకు ఇటీవల తొమ్మిది మంది మంత్రులు రాజీనామా కూడా చేశారు. మరో ఆరుగురు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన అధిష్టానం యడ్డీకి సిఎం మార్పుపై హామీ ఇచ్చింది. దీంతో మంత్రులు రాజీనామాలు వెనక్కి తీసుకున్నారు. అనంతరం గౌడను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం ఆయనకు నచ్చజెప్పి రాజీనామా చేయించింది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications