సస్పెన్షన్‌పై కౌంటర్: ఎదురు తిరిగిన కొడాలి నాని

Chandrababu Naidu - Kodali Nani
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తన సస్పెన్షన్ వేటు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎదురు తిరిగారు. నాని రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. ఆయన వారిని కలిసినట్టు తెలియగానే టిడిపి అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.

గత కొంతకాలంగా నాని జగన్ వైపు వెళతారనే ప్రచారం జరుగుతోంది. సోమవారం అతను జగన్‌ను కలవడంతో టిడిపిని వదిలినట్లేనని అందరూ భావించారు. మీడియా, రాజకీయ పార్టీలు, విశ్లేషకులు సహా అందరూ అదే భావించారు. టిడిపి కూడా నాని పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారని, అందుకే జగన్‌ను కలిశారని భావించి అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ సస్పెన్షన్ వేటుపై మాత్రం నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారేది లేదని చెప్పుకొచ్చారు.

తనను పార్టీ నుండి ఎందుకు బహిష్కరించారని, వ్యక్తిగత సంబంధాల కారణంగా ఇతర పార్టీ నేతలను కలిస్తేనే బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా వ్యక్తిగతంగా ఇతర పార్టీ నేతలను కలిశారు, కలుస్తుంటారని అన్నారు. తనకు జగన్‌తో వ్యక్తిగతంగా సంబంధముందని, అతను కష్టాలలో ఉన్నాడనే కలిశానని చెప్పారు. అలా కలిస్తేనే వేటు వేయడం దారుణమని, దీనిపై తనకు బాబు, తనను విమర్శించిన టిడిపి నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సాధారణంగా సస్పెన్షన్ వేటు వేసే ముందు షోకాజ్ నోటీసులు ఇస్తారని, కానీ తనకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. తనపై అన్యాయంగా వేటు వేసినందుకు అవసరమైతే కోర్టుకు, గవర్నర్ వద్దకు కూడా వెళతానని చెప్పారు. వేటుపై వెనక్కి తగ్గకుంటే మాత్రం తాను జగన్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే టిడిపి నేతలు మాత్రం ఆయన జగన్‌ను ఒకటికి నాలుగుసార్లు కలవడం పార్టీ క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుందని, అందుకే వేటు వేసినట్లు చెబుతున్నారు.

కాగా నాని వ్యాఖ్యలు గమనిస్తుంటే మాత్రం ఆయన జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధపడి వ్యూహాత్మకంగా టిడిపిని ఆత్మరక్షణలో పడేసేందుకే ఇలాంటి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. పార్టీ వీడాలనే ఉద్దేశ్యం లేకుంటే నాని సోమవారమే వేటు గురించి తెలిసినప్పుడే ఎందుకు స్పందించలేదని అంటున్నారు. అంతేకాదు వేటు వెనక్కి తీసుకోవడమే కాకుండా బాబు బహిరంగ క్షమాపణ చెబితేనే తాను పార్టీలో కొనసాగుతాననే విధంగా నాని మాట్లాడారు. అంటే బాబు క్షమాపణ చెప్పేది లేదు, ఆయన పార్టీలో ఉండేది లేదంటున్నారు.

వెళుతూ వెళుతూ పార్టీని నష్ట పర్చాలనే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ వీడాలని భావించలేదని, చంద్రబాబే తనను టార్గెట్ చేసుకొని వేటు వేశారని నాని ఆరోపిస్తున్నారని అంటున్నారు. తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానమని, జూనియర్ ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉందని చెబుతూ లోకేష్ పేరును ప్రస్తావిస్తూ... తనపై వేటు ఉద్దేశ్య పూర్వకమని చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ వర్గాన్ని బాబు టార్గెట్ చేసుకున్నారనే భావనను కలిగించే ప్రయత్నం చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+