కొలరాడో థియేటర్లో కాల్పులు: ప్రియురాళ్ల ప్రాణాల కోసం

The Dark Knight Rises
వాషింగ్టన్: కొలరాడోలోని డెన్వర్ థియేటర్లో నాలుగు రోజుల క్రితం ఓ ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, యాభై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ సమయంలో సినిమా చూసేందుకు తమ ప్రియురాళ్లతో కలిసి వచ్చిన ముగ్గురు యువకులు మాత్రం ధైర్య సాహసాలు, త్యాగశీలత ప్రదర్సించారట.

ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధమని ఆ ముగ్గురు చేతల్లో చేసి చూపించారు. తమ ప్రేయసుల కోసం తుపాకీ గుళ్లకు ఎదురొడ్డారు. తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి ప్రేమించిన నెచ్చెలిలను బతికించుకున్నారు. వారు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. ఇరవయ్యేడేళ్ల మాట్ మెక్ క్విన్, ఇరవయ్యారేళ్ల జోనాథన్ బ్లంక్, ఇరవై నాలుగేళ్ల అలెక్స్ టెవేజ్‌లు తమ ప్రియురాళ్లతో కలిసి బ్యాట్‌మన్ సిరీస్‌లో కొత్తగా వచ్చిన ద డార్క్ నైట్ రైజెస్ సినిమా మొదటి షోకు వచ్చారు.

సినిమా మొదలైన కొద్ది సేపటికే జేమ్స్ హోమ్స్ అనే ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. జనంపై తన తుపాకితో జేమ్స్ కాల్పులు జరపడం ప్రారంభించడం ఈ ముగ్గురు యువకులు గమనించారు. తుపాకీ గుళ్ల నుంచి తన ప్రేయసి సమంతా యోలర్‌ను రక్షించేందుకు మెక్‌ క్విన్ అడ్డంగా నిలబడ్డాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయి ఆమెను రక్షించాడు.

బ్లంక్ తన ప్రియురాలు జెన్సన్ యంగ్‌ను సీటుకింద కూర్చోబెట్టి బుల్లెట్ల బారి నుండి రక్షించాడు. అతను మాత్రం ప్రాణాలతో బయటపడలేక పోయాడు. తనను బతికించడం కోసమే బ్లంక్ ప్రాణాలు కోల్పోయాడని జెన్సన్ కన్నీరుమున్నీరవుతోంది. టెవెజ్ తన ప్రియురాలు అమందా లిండ్జెన్ కూడా ప్రియురాలికి గుళ్లు తగలకుండా అడ్డుగా నిలబడ్డాడు. ఇతనూ ప్రాణాలు కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+