Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి బెయిల్ డీల్: హాజరుకు గడువు కోరిన ఎమ్మెల్యేలు

Gali Somasekhar Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మంజూరు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ముందు హాజరు కావడానికి తమకు గడువు కావాలని కర్ణాటక శాసనసభ్యులు గాలి సోమశేఖర రెడ్డి, సురేష్ బాబు కోర్టును కోరారు. గాలి బెయిల్ డీల్ కేసులో మూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ వారికి ఎసిబి ఇటీవల నోటీసులు జారీ చేసింది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున తమకు ఆగస్టు 3వ తేదీ వరకు సమయం ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ కేసులో వారు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసుకున్నారు.

బళ్లారి అర్బన్ శానససభ్యుడు గాలి సోమశేఖర రెడ్డికి, కంప్లీ శాసనసభ్యుడు సురేష్‌బాబుకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తమ కార్యాలయానికి రావాలని ఎసిబి వారిద్దరిని ఆదేశించింది. ఈ ఇద్దరు శాసనసభ్యులను కూడా ఎసిబి అరెస్టు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వారిద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నట్లు తెలుస్తోంది.

సోమశేఖర రెడ్డి, సురేష్‌బాబు విదేశాలకు పారిపోకుండా ఎసిబి ఇది వరకే అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బంధువు, వ్యాపారి దశరథరామిరెడ్డిని ఎసిబి ఇటీవల అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఎసిబి పలువురిని అరెస్టు చేసింది. దశరథరామిరెడ్డిని ఎసిబి అధికారులు ఆదివారం కోర్టులో హాజరుపర్చింది. దీంతో అతనికి వచ్చే నెల 3వ తేది వరకు రిమాండ్ విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు ఇరవై కోట్లు మాత్రమే కాదని రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లుగా ఇటీవల అరెస్టయిన జిల్లా జడ్జి తన వాంగ్మూలంలో చెప్పారు.

చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు ములాఖత్‌లో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన అనుచరులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇప్పించాలని, ఇంత ఖర్చయినా ఫర్వాలేదని గాలి చెప్పేవాడని తెలుస్తోంది. దాంతో ఈ బాధ్యత ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి, కర్నాటకలోని కంప్లి శాసనసభ్యుడు సురేష్‌లు తమ భుజానికి ఎత్తుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వెల్లడయిన అంశాల ప్రకారం బెయిల్ కోసం వీరు వేర్వేరు వ్యక్తుల ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+