ఇది కాదు పద్ధతి: అన్నాహజారే దీక్షపై అమర్థ్యసేన్

అమర్థ్యసేన్ సిఎన్ఎన్-ఐబిఎన్ ముఖాముఖి కార్యక్రమంలో అన్నా హజారే దీక్షపై స్పందించారు. దీక్షలు, ధర్నాలతో అవినీతిపై నిరసన వ్యక్తం చేసే బదులు వ్యవస్థలోని లోపాలను మార్చేందుకు నిరసన వ్యక్తం చేస్తున్న వారు ప్రయత్నించాలని సూచించారు. అన్నా, అతని బృందంపై తనకు సానుభూతి ఉందని అయితే వారు ఎంచుకున్న మార్గంతో మాత్రం తాను ఏకీభవించలేనని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ తీరును అవగతం చేసుకున్న తర్వాత అందులోని లోపాలను గుర్తించాలన్నారు. అన్నా జట్టు సభ్యులు అవినీతిపై వ్యక్తపరుస్తున్న ఆగ్రహం సరైనదేనని కానీ ఎంచుకున్న మార్గమే సరైంది కాదన్నారు. ధర్నాలు లేదా ఆందోళనలతోనో లేదా ఓ వ్యక్తిని చెట్టుకు కట్టి వేయడం ద్వారానో వ్యవస్థలో వేళ్లూనుకు పోయిన పద్ధతిని మనం మార్చజాలమన్నారు.
ఏ ఒక్క వ్యక్తో నిలబడి అవినీతి వద్దు అని చెప్పడం వారి ఇన్నోసెంట్‌ను చూపిస్తోందన్నారు. చిన్న పిల్లలు సైతం అవినీతి వద్దనే చెబుతారని, అవినీతి వద్దని చెప్పడం సాధారణమేనని, కానీ దానిని నిర్మూలించేందుకు ప్రయత్నించాలన్నారు. దానిని ఎలా నిర్మూలించాలన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న అన్నారు. అవినీతికి గల కారణాలు ఏమిటో కనుగొనాలన్నారు.












Click it and Unblock the Notifications