మంత్రి వర్గంలోకి రాహుల్ గాంధీ నో: పార్టీలో ఐతే ఓకే

త్వరలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు దీనిపై స్పందించారని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారని తెలుస్తోంది. పార్టీలోని పలువురు నేతలు ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సూచిస్తుండగా.. ఆయన మాత్రం పార్టీలోనే పని చేయాలని భావిస్తున్నారట.
కేబినెట్‌లో చేరితే ప్రభుత్వం పని తీరుపై అవగాహన పెంచుకునే వీలుంటుందని, తద్వారా 2014లో ప్రధాని పీఠమెక్కేందుకు అన్ని విధాలా అర్హత సాధించినట్లుగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాహుల్ మాత్రం ససేమీరా అంటున్నారట. దీంతో ఆయనకు పార్టీలోనే ఉపాధ్యక్ష పదవి లేదా మరో పదవి కానీ ఇచ్చే అవకాశముందని అంటున్నారు.
రాహుల్ మంత్రి వర్గంలోకి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రాహుల్ వస్తే పార్టీలో, ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తే ఆయన నిరాసక్తత వ్యక్తం చేయడం వారు జీర్ణించుకోలేక పోతున్నారట. కాగా ఇప్పటికే చిదంబరాన్ని ఆర్థిక మంత్రిగా, షిండేను హోంమంత్రిగా నియమించనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications