ప్లీజ్! బాబును ఒప్పించండి!: నారాయణతో కోదండరామ్

Kodandaram-K Narayana
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించాలని తెలంగాణ జెఎసి నేతలు సిపిఐ రాష్ట్ర నాయకులను కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి నేతలు గురువారం కలిశారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇస్తే అందరం కలిసి కాంగ్రెసుపై ఒత్తిడి తెద్దామని, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని తెలంగాణ జెఎసి నేతలు ప్రతిపాదించారు.

తెలంగాణపై చంద్రబాబును ఒప్పించే బాధ్యత మీదేనని, తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ రాస్తే కాంగ్రెసును ఒంటరి చేద్దామని తెలంగాణ జెఎసి నేతలు నారాయణతో చెప్పారు. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెసు ఒత్తిడి తెద్దామని సూచించారు. తెలంగాణపై లేఖ ఇస్తామని చంద్రబాబు అంటున్నారు కదా, వేచి చూద్దామని నారాయణ తెలంగాణ జెఎసి నేతలతో చెప్పారు.

తమతో కలవాలని తెలంగాణ జెఎసి నేతలు సిపిఐ కార్యదర్శి నారాయణను కోరారు. జెఎసిలో తమ పార్టీ చేరాలంటే పార్టీలో చర్చించాల్సి ఉంటుందని నారాయణ అంటూనే వివిధ పార్టీలున్న జెఎసిలో చేరితే కొత్త సమస్యలు వస్తాయని, పార్టీ తమ తమ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ ఎజెండాతో పాటు తెలంగాణ జెఎసి కార్యకలాపాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని నారాయణ జెఎసి నేతలకు చెప్పారు.

తెలంగాణ కార్యాచరణపై తెలంగాణ జెఎసి నాయకులు సిపిఐ నేత నారాయణతో చర్చించారు. పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చాయి. సిపిఐ చేపట్టే తెలంగాణ పోరు యాత్రకు మద్దతు ఇస్తామని జెఎసి నేతలు చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ జెఎసి తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు సిపిఐ మద్దతు ఇస్తుంది. ఈ విషయాన్ని భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో కోదండరామ్ చెప్పారు.

తమకు సిపిఐ నాయకులు, కార్యకర్తల మద్దతు ఉంటుందని నారాయణ చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని, తెలంగాణను ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు తెలంగాణ జెఎసి కార్యక్రమాలకు తాము మద్దతుగా నిలబడతామని నారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+