చెల్లదని హైకోర్టు తీర్పు: ఎలా చూసినా దినేష్ రెడ్డే డిజిపి!

Dinesh Reddy
హైదరాబాద్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి)గా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని, రెండు వారాల్లోగా కొత్త డిజిపిని నియమించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ దినేషే డిజిగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా దినేష్ రెడ్డియే కొనసాగనున్నారు. హెచ్ఏజి ప్లస్ స్కేల్ ఉన్న అధికారులలో దినేష్ రెడ్డి, ప్రసాద రావు, టిపి దాస్, అరుణ బహుగుణ, హుడా ఉన్నారు. వీరిలో దినేష్ రెడ్డియే సీనియర్.

ఇక గతంలో దినేష్ రెడ్డితో పాటు డిజిపి పదవికి పోటీ పడ్డ గౌతమ్ కుమార్, శివశంకర్‌లు ఇప్పుడు పదవులలో లేరు. దినేష్ కన్నా సీనియర్ అయినా, ఆయన బ్యాచ్ అయినా వారెవరూ పదవులలో లేరు. గౌతమ్ కుమార్ ఇటీవలే విఆర్ఎస్ తీసుకున్నారు. శివశంకర్ పదవీ విరమణ చేశారు. మరో సీనియర్ అధికారి ఉమేష్ కుమార్ ఉన్నప్పటికీ కేసులు ఉన్నాయి! డిజిపిగా నియామకమయ్యే అధికారిపై ఎలాంటి కేసులు ఉండకూడదు. దీంతో దినేష్ రెడ్డి పదవికి ఎలాంటి ఢోకా లేదనే చెప్పవచ్చు. ఎలా చూసినా మళ్లీ దినేష్ రెడ్డియే కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కాగా డిజిపి దినేష్ రెడ్డి నియామకాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం తప్పు పట్టిన విషయం తెలిసిందే. దినేష్ రెడ్డి నియామకం చెల్లదంటూ హైకోర్టు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పింది. దినేష్‌ను రెండు వారాలలోగా డిజిపిగా తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పోలీసు హెడ్‌గా డిజిపి తీసుకుంటున్న జీతభత్యాలు వెంటనే రద్దు చేయాలని చెప్పింది.

రెండు వారాలలోగా కొత్త డిజిపిని నియమించాలని, అప్పటి వరకు దినేష్‌ను ఇంచార్జ్‌గా ఉంచాలని సూచించింది. దినేష్ రెడ్డి నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాటు రూ.5వేల జరిమానా కూడా విధించింది. సీనియర్ ఐపిఎస్ అధికారుల జాబితాను యపిఎస్పీకి పంపించాలని, వారి సూచనల మేరకు సీనియారిటీ, సిన్సియారిటీ ప్రకారం కొత్త డిజిపిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

డిజిపి దినేష్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ అధికారి గౌతమ్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం క్యాట్ దినేష్ రెడ్డి నియామకాన్ని తప్పు పట్టింది. ఆయనను వెంటనే తొలగించి, కొత్త డిజిపిని నియమించాలని సూచించింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి దినేష్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురయింది.

వారం లోగా నియామక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా లేక హైకోర్టు తీర్పు మేరకు రెండు వారాల్లోగా కొత్త డిజిపిని నియమిస్తుందా అనే అంశం త్వరలో తేలనుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+