ఆన్‌లైన్‌లో అశ్లీల వ్యాఖ్యలు: అమ్మాయి ఆత్మహత్య

Girl ends life after being harassed online
జలంధర్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఇద్దరు యువకులు అశ్లీల వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఓ 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. ఓ సూసైడ్ నోట్ రాసి రక్షా శర్మ అనే ద్వితీయ సంవత్సరం డిప్లమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

దీపక్ సైనీ, లవ్‌ప్రీత్ సింగ్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది. ఆ ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిద్దరు కూడా అదే పాలిటెక్నిక్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.

రక్ష, లవ్‌ప్రీత్ గతంలో మిత్రులను, కొంత కాలం క్రితం వారి స్నేహం చెడిపోయిందని పోలీసులు అధికారులు చెబుతున్నారు. రక్ష మాట్లాడడం ఆపేయడంతో లవ్‌ప్రీత్ ఆమె సెల్‌ఫోన్‌కు తీవ్రమైన వ్యాఖ్యలతో మెసేజ్‌లు గుప్పిస్తూ వెళ్లాడని చెబుతున్నారు. యాసిడ్ పోస్తానని కూడా అతను అమ్మాయిని బెదిరించినట్లు తెలుపుతున్నారు

మంగళవారంనాడు సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో లవ్‌ప్రీత్, దీపక్ అశ్లీల వ్యాఖ్యలు పోస్టు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రక్ష తన హాస్టల్ గదిలోకి వెళ్లిపోయింది. గదికి లోపలి నుంచి గొళ్లెం పెట్టుకుంది. ఆమె రాత్రి అటెండన్స్ మార్కు చేయకపోవడంతో హాస్టల్ విద్యార్థినులు ఆమె గదికి వెళ్లారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇతర హాస్టల్ వార్డెన్‌కు సమాచారం చ్చారు. బలవంతంగా తలుపులు తీసి చూసేసరికి ఆమె శవమై కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+