• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దక్షిణాఫ్రికాలో పోలీసు కాల్పులు: 36 మంది మృతి

By Pratap
|

South Africa
జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలోని మారికానా ప్టాటినం గని వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో సమ్మె చేస్తున్న 36 మంది కార్మికులు మరణించారు. పోటెత్తిన కార్మికులను పోలీసులు ముందు హెచ్చరించారు. తర్వాత వాటర్ క్యానన్లు ఓపెన్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా చొచ్చుకెళ్లిన కార్మికులు చేతుల్లో ఉన్న ఆయుధాలకు పని చెబుతూ రెండు వరసల పోలీసులను దాటుకుని ముందుకెళ్లిపోయారు. దాంతో పోలీసుల చేతుల్లోని ఆయుధాలు గర్జించాయి. తీవ్రమైన కాల్పుల హోరు ముగిశాక చూస్తే 36 మంది కార్మికులు మరణించి ఉన్నారు. మరో 78 మందికి తూటాల గాయాలయ్యాయి.

దక్షిణాఫ్రికాలోని మారికానా ప్లాటినం గని వద్ద గురువారం సాయంత్రం.. స్థానిక కాలమానం ప్రకారం నాలుగు గంటల సమయంలో ఈ మారణకాండ జరిగింది.. తెల్లవారి పాలన నుంచి దక్షిణాఫ్రికా విముక్తి పొందాక జరిగిన అతిపెద్ద విషాదమిది. బంగారం కన్నా విలువైన ప్లాటినం గనులు ఈ ప్రాంతంలో కొల్లలుగా ఉన్నాయి. లండన్‌కు చెందిన లాన్‌మిన్ అనే కంపెనీ ఈ గనుల్లో తవ్వకాలకు అనుమతి పొందింది.

అయితే, ఇందులో పనిచేస్తున్న కార్మికులు తమకు ఇచ్చే వేతనాలు సరిపోవట్లేదని చాలా రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలను ప్రస్తుతం ఉన్నదాని కన్నా మూడింతల మేర పెంచాలని కోరుతూ ఆగస్టు 10వ తేదీ నుంచి పని మానేసి గనిలోంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. వారి ఆందోళన ఆగ్రహంగా మారింది. దీంతో, ఆగస్టు 14 నుంచి కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది.

ఈ పరిణామంతో మరింత ఆగ్రహం చెందిన కార్మికులు కత్తులు, కర్రలు, ఈటెలతో నిరసనకు దిగారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం అక్కడ పోలీసులను మోహరించింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. "మారణాయుధాలతో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు ఒక్క ఉదుటున ముందుకు దూసుకురావడంతో కాల్పులు జరపక తప్పలేదు'' అని పోలీసు కమిషనర్ రియా ఫియేగా వివరించారు.

ఈ కాల్పుల గురించి తెలియగానే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమా తన మొజాంబిక్ పర్యటనను వాయిదా వేసుకుని అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ దేశ పోలీసు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మిన్సి మాత్రం - "ఆయుధాలతో, కరడుగట్టిన నేరస్థుల్లా పోలీసులను హతమార్చే పరిస్థితుల్లో పోలీసులు మాత్రం ఏం చేయగలరు?'' అని వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In one of the deadliest protests since the end of the apartheid era, at least 36 striking South African miners were shot dead by police at a platinum mine, sending shock waves across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more