హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు పెట్టిన ఎర్రబెల్లి దయాకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేశారని ఎర్రబెల్లి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట తప్పటం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం నాశనమవుతోందన్నారు. నెల రోజుల క్రితం కిరణ్ తమ ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తుందని ప్రకటించారని, ఆయన మాటలను నమ్మిన రైతులు పంటలు వేసుకున్నారన్నారు.

రైతులు నాట్లు పెట్టారని, అయితే కిరణ్ మాత్రం విద్యుత్ పైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాలలో ప్రజలు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కిరణ్ మాట తప్పడం వల్లనే రైతులు పంటలు నష్టపోతున్నారని, ఈ నష్టానికి కారణం ప్రభుత్వమే అన్నారు. ఈ నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా లేక కిరణ్ ఇస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సమస్యపై ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చీటింగ్ కేసు నమోదు చేశామని, పోలీసులు ముఖ్యమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కాగా వర్షాభావం వల్లనే విద్యుత్ సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ప్రతిరోజు రూ.12 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ కొంటుందని, రెండు మూడు రోజుల్లో విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Telugudesam party senior leaders Errabelli Dayakar Rao filed cheating case against CM Kiran Kumar Reddy in Punjagutta police station on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X