హైదరాబాద్ పాత బస్తీలో హుజీ ఉగ్రవాది అరెస్ట్

వీరికి ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హుజీలతో సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో పాతబస్తీకి చెందిన ఇర్షాద్ ఉన్నాడు. ఇర్షాద్ కుటుం బం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బాబానగర్‌లో నివసిస్తోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడికి ఏ పాపం తెలియదని ఇర్షాద్ తల్లి సయిదా కౌసర్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేసింది. ఎంఎస్ కళాశాలలో బీకామ్‌ను ఇర్షాద్ అభ్యసిస్తున్నాడు. ఇదిలాఉండగా, పట్టుబడిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ స్థానిక ఐదో ఎంసీఎంఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అరెస్టుల వెనుక ఎలాంటి కుట్రా లేదని కర్ణాటక హోంశాఖ మంత్రి ఆర్.అశోక్ స్పష్టం చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, నిర్దోషులుగా తేలితే అరెస్టు అయిన వారిని విడిచి పెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications