థాకరేది బీహార్: దిగ్విజయ్ సింగ్ ఎదురుదాడి

ముంబై చరిత్రను చూస్తే అది జాలర్ల నగరం అనేది అర్థమవుతుందని, మిగతా వారంతా బయటి నుంచి స్థిరపడినవారేనని ఆయన అన్నారు. మహారాష్ట్రలోకి థాకరేనే చొరబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు సమాచారం ఇవ్వకుండా టీనేజర్‌ను అరెస్టు చేసిన ముంబై పోలీసులపై బీహారీ అధికారులు చర్యలు తీసుకుంటే మహారాష్ట్రలోని బీహారీలను పంపించేస్తామని రాజ్ థాకరే శుక్రవారం హెచ్చరించారు.
మహారాష్ట్రలో హిందీ మాట్లాడేవారిపై థాకరే తరుచుగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడిని బీహార్‌లో అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ రాజ్ థాకరేను ప్రోత్సహిస్తోందని బీహార్ జెడియు నాయకుడు శివానంద తివారీ విమర్శించారు. పంజాబ్‌లో జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేను తయారు చేసినట్లు మహారాష్ట్రలో రాజ్ థాకరేను కాంగ్రెసు తయారు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్ థాకరే రాజ్యాంగాధికారానికి సవాల్ విసురుతున్నారని ఆయన అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications