విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జై ఆంధ్ర లీడర్ వసంత అరెస్టు: నందిగామ ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasantha Nageswar Rao
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామలో ‘జైఆంధ్రా' ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జై ఆంధ్ర బహిరంగ సభను పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. అయితే ఈ సభకు అనుమతి లేదని చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వరరావును అరెస్టు చేశారు.

ప్రశాంతంగా చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమం ఆగదని, కొందరు సమైక్యాంధ్ర నేతలు కావాలనే తనను అరెస్టు చేయించారని మండిపడ్డారు. తమ నేతను అరెస్టు చేయడంతో కార్యకర్తలు రోడ్డుపై బెఠాయించి ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని జై ఆంధ్ర ఉద్యమ నేతలు ప్రతిజ్ఞ చేశారు. దీంతో సభ జరుగబోయే పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పోటీ పడడంతో నందిగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వసంత నాగేశ్వర రావుతో పాటు పోలీసులు దేవినేని అవినాష్‌ను కూడా అరెస్టు చేశారు. నందిగామలో తలపెట్టిన ప్రత్యేకాంధ్ర సదస్సును అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరించారు. తనను బహిరంగ సభకు వెళ్లనివ్వాలని అరెస్టుకు ముందు వసంత నాగేశ్వరరావు పోలీసులతో వాదనకు దిగారు.

రోడ్డుపైనే బైఠాయించారు. దాంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో ఆయనను అరెస్టు చేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని కూడా అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు.

English summary

 Jai Andhra leader Vasabth Nageswar Rao has been arrested at Nandigama of Krishna district. He made arrangments to convene a convention demandind separate Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X