ఇటలీలోను పోటీ: రాహుల్‌పై మోడీ ఎద్దేవా, నితీష్ విషెస్

తాను భారత్‌లో ప్రాంతీయ నేతను అయినందుకు గర్విస్తున్నానని మోడీ చెప్పారు. గతంలో ఓ కాంగ్రెసు నేత మాట్లాడుతూ.. రాహుల్ జాతీయ నేత అని, తాను మాత్రం కేవలం ప్రాంతీయ నాయకుడు అని చెప్పారని మోడీ గుర్తు చేశారు. తాను గుజరాత్ నేతను అయినందుకు గర్విస్తున్నానని, కానీ రాహుల్ జాతీయ నేత అంటే తాను అంగీకరించనని, అతను ఇంటర్నేషనల్ లీడర్ అన్నారు. రాహుల్‌కు ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశముందన్నారు.
కాగా ఈ రోజు(సెప్టెంబర్ 17)న నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఆయన తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి పాదాలకు నమస్కరించడం తనకు గ్రేటెస్ట్ దీవెనలు అని మోడీ పేర్కొన్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, అతను నిండ నూరేళ్లు ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకరి పుట్టిన రోజు సందర్భంగా మరొకరు విషెస్ చెప్పాలని, తాను కూడా అలాగే మోడీకి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. మోడీని నితీష్ కుమార్ 2014 ఎన్నికలలో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications