గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెక్చరర్ భార్యతో సంబంధం: వీడిన హత్య కేసు మిస్టరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 12న జరిగిన శ్రీనివాస రావు అనే యువకుడి హత్య కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వనస్థలిపురంలో నివసించే సికె బాబు ఓ కార్పోరేట్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థులను చేర్చించి శ్రీనివాస రావుతో అతనికి పరిచయం ఏర్పడింది.

ఇతను కూడా వనస్థలిపురంలోనే ఉండేవాడు. ఇరువురి మధ్య ఉన్న పరిచయంతో శ్రీనివాస రావు అప్పుడప్పుడు బాబు ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో లెక్చరర్ బాబు భార్యతో శ్రీనివాస రావు అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాబు అతడిపై వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి వచ్చినా, తన భార్యకు ఫోన్లు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు.

తర్వాత కొంతమంది పెద్దలతో పంచాయతీ పెట్టగా వారు శ్రీనివాస రావును సొంతూరు వెళ్లిపోమని సూచించారు. ఇంత చేసినప్పటికీ శ్రీనివాస రావు.. బాబు భార్యకు ఫోన్లు చేశాడు. దీంతో బాబుకు అతనిపై మరింత ఆగ్రహం వచ్చింది. కుంట్లూర్‌కు, ఎల్బీనగర్‌కు చెందిన తన ఇద్దరి స్నేహితులతో ఈ విషయాన్ని బాబు చెప్పాడు. వారికి ఈ నెల 12వ తేదిన వనస్థలిపురంలో శ్రీనివాస రావు కనిపించాడు. దీంతో అతనిని పట్టుకొని కొట్టారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస రావు హెచ్చరించడంతో వారు అతన్ని కారులో ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకు వెళ్లారు. చొక్కాతో అతని మెడకు ఉరి వేసి హత్య చేశారు. అనంతరం కోహెడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేశారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అతనిని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.

English summary
A corporate college lecturer arrested by Hayat Nagar 
 
 police for killing a young.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X