వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ఫ్యామిలీపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam Map
విశాఖపట్నం: యలమంచిలి శాసనసభ్యుడు ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజు(కన్నబాబు) ఎసిబి అధికారులు సోమవారం ఆయనపై ఓ కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సాధారణంగా అధికారులపైనే ఈ కేసును నమోదు చేసే ఎసిబి... ఇప్పుడు ప్రజా ప్రతినిధిపైనా నమోదు చేసింది. ఓ ఎమ్మెల్యేపై ఎసిబి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.

ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులు (భార్య, కుమారులు, కుమార్తె) ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ చేయాలంటూ యలమంచిలికి చెందిన ఆడారి ఆదిమూర్తి ఈనెల 11న విశాఖపట్నం ఎసిబి న్యాయస్థానంలో కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జివి కృష్ణయ్య అక్టోబర్ 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఎసిబి డీఎస్పీని ఆదేశించారు.

ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎసిబి అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. కాగా, తన దగ్గర పని చేస్తున్న ఇద్దరు ఎస్సీ మహిళల పేరిట బ్యాంకుల నుంచి బస్సుల కొనుగోలుకు రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు కోటి రూపాయల విలువైన రాయితీని పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

దర్యాప్తులో ఆరోపణలన్నీ వాస్తవమని తేల్చి రూ.98 లక్షలను ఎమ్మెల్యే నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది. అయితే, ప్రభుత్వం రికవరీ చేయకపోవడంపై యలమంచిలికి చెందిన కొయిలాడ వెంకటరావు ఇదే నెలలో హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యేపై విచారణ నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.

English summary
ACB on Monday registered a DA case against Congress Yalamanchili MLA Kanna Babu, and his family members under the Prevention of Corruption Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X