వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతిక ఆత్మహత్య: గోపాల్ కందాకు జ్యూడిషియల్ కస్టడే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetika Sharma - Gopal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు, హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు అక్టోబర్ 6వ తేది వరకు పొడిగించింది. ఇతనిని అధికారులు కొంతకాలంగా తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి ఇచ్చింది. దీంతో అంత వీజీగా అతను జ్యూడీషియల్ కస్టడీ నుండి తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదే కేసులో మరో నిందితుడు అరుణ చద్దా జ్యూడిషియల్ కస్టడీని కూడా కోర్టు అక్టోబర్ 6వ తేది వరకు పొడిగించింది. ఈ నెల 20వ తేదిన ఢిల్లీ హైకోర్టు గోపాల్ కందా బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసిన విషయం తెలిసిందే. గీతిక హత్య కేసులో కందా ప్రధాన నిందితుడు. కాగా గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితురాలు అరుణా చద్దా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ట్రయల్ కోర్టులో తాజా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకోవడానికి వీలుగా ఆమె ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

జస్టిస్ మన్మోహన్ బెయిల్ పిటిషన్ విచారణకు అక్టోబర్‌లో తేదీలు ఇవ్వడానికి నిరాకరించడంతో, విచారణకు డిసెంబర్‌కు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో చద్దా తరఫు న్యాయవాది రమేష్ గుప్తా బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు అంత గడువు తీసుకోవడంతో బెయిల్ కోరిన ప్రయోజనమే దెబ్బ తింటుందని, ఈలోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని, పరిస్థితి పూర్తిగా మారిపోతుందని గుప్తా అన్నారు. త్వరగా బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తూ మన్మోహన్ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించారు.

ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. నలభై ఏళ్ల వయస్సు గల అరుణా చద్దా మూతపడిన మాజీ హర్యానా మంత్రి గోపాల్ గోయల్ కందా ఎండిఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఆత్మహత్య చేసుకున్న గీతికా శర్మ కూడా అదే సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. తనకు ఏడేళ్ల కూతురు, ముదుసలి తల్లిదండ్రులు ఉన్నారని, వారి సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చద్దా పిటిషన్ దాఖలు చేశారు.

తన సంపాదన తప్ప తన కుటుంబానికి మరో ఆదరువు లేదని ఆమె చెప్పుకున్నారు. 23 ఏళ్ల గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్‌లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.

English summary
It seems that former Haryana minister Gopal Kanda will not be relieved so easily as his judicial custody on Tuesday, Sept 25 has been extended till Oct 6. Judicial custody of Kanda's aide Aruna Chaddha has also been extended till Oct 6. Delhi High Court earlier on Sept 20 denied bail to the former Haryana minister regarding Geetika Sharma suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X